శ్రీ అంజనీ నందనా ..... స్వామి శ్రీ రామ పద సేవాకా
సింగర్ : పారుపల్లి రంగనాథ్
శ్రీ అంజనీ నందనా ..... స్వామి శ్రీ రామ పద సేవాకా
పావని పాలించి లాలించరా ...... ....ఆ ఆ ఆ ..|| శ్రీ ||
వార్దిని లంఘించి వైదేహిని నే చూచి
నీ విభుని కార్యంబు నెరవేర్చినావే ...ఏ ఏ ఏ
స్వామి భవసాగరము దాటు బల మోసగ లేవా....
అభయము కరుణించి ఆదుకో లేవా
అడిగిన వరములు అందించ రావా || శ్రీ ||
సింధూర మందించి స్తుతి యించి నానే ....
వాడ మాల అందించి వినిపించి నానే ...
కడగండ్లు తొలగించి కరుణించ రావా
స్వామి కరుణించి శాంతిని కలిగించ లేవా.......
స్వామీ ..... ఈఈఈ ఈఈఈ ఈఈఈ
అడుగుల బడి నిన్ను అర్థించి నానే ... ఏఏఏ .. ఏఏఏ
అభయము కరుణించి ఆదుకో లేవా
అడిగిన వరములు అందించ రావా || శ్రీ ||
రాక్షసుల రణమందు శిక్షించి నావే ......
లక్ష్మణుని ప్రాణాలు రక్షించి నావే .....
దైన్యము తొలగించి దీవించ లేవా .....
అభయము కరుణించి ఆదుకో లేవా.....
అడిగిన వరములు అందించ రావా || శ్రీ ||