కైలాసాన నీవే నీవే వున్నావూ
LYRICS : Chiranjeevi Music: PurushothamaSai Singer : P.Susheela
కైలాసాన నీవే నీవే వున్నావూ
కాంచి లోన నీవే వున్నావూ || కైలా ||
అణు అణువూ నీవైతే, కణ కణ మూ నీ దైతే
అణు అణువూ నీవైతే, కణమూ నీ దైతే
ఆత్మకు అర్పించనా ..ఆఆఆ... వందనం
అది అమ్మను చేరాలి నిరంతరం నిరంతరం || కైలా ||
కైటభనే కూల్చగనే , నీ నేత్ర త్రయముల నెగసినా ...
విస్ఫు లింగమా ..ఆ ఆ ఆ ... అది సూర్య బింబమా ...
మహిషమునే మించగనే నీ రమ్య వదనమున విరసినా
అమృతమా అది చంద్ర బింబమా
త్రిగుణములకు తొలి రూపం నీవే .....
త్రిభువనముల తొలి దైవం నీవే
త్రిపుర సుందరీ నీవే, శాస్త్రవ భంజవి
నీవే నీవే నీవే నీవే నీవే నీవే ...... || కైలా ||
వాసవు నే చేరగనే నీ చరణ ద్వయమున పలికినా
తాండవమా .... ఆఆఆ .... అది సృష్టి రూపమా
విష్ణువు నే కోరగనే నీ మధుర హాసమున చిలికినా
మాయ రూపమా ....ఆఆఆ.... అది లోక కార్యమా
మా కన్నుల వెలిగే దీపం నీవే
మా గుండెలు కొలిచే దైవం నీవే నీవే
ఝణ ఝణ ఝoకృతి నీవే .....
ధిమి ధిమి దిoకృతి నీవే .... .
నీవే నీవే నీవే నీవే నీవే నీవే ........ .|| కైలా ||
collected by : sgk murthy
No comments:
Post a Comment