శ్రీ అన్నమాచార్య కీర్తనలు
Singers: Priya sisters
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామ ...... ఆ ఆ ఆ || అంత ||
కులమును నీవే గోవిందుడా ... నా ...
నా .... కలిమియు నీవే కరుణానిధీ
తలపును నీవే ధరణీధరా
నా .... నెలవును నీవే నీరజనాభా ...... ఆ ఆ ఆ || అంత ||
తనువును నీవే దామోధరా
నా ....మానికియూ నీవే మధుసూదనా
వినికియు నీవే ವಿಠలుడా .......
నా .... వెనుక ముందు నీవే విష్ణు దేవుడా ..... ఆ ఆ ఆ || అంత ||
పుట్టుగు నీవే పురుషోత్తమా
కోన .... నట్ట నడుము నీవే నారాయణా
ఇట్టే శ్రీ వేంక టేశ్వరుడా
నాకు..... నెత్తున గతి ఇంక నీవే .... నీవే.... ...ఆ ఆ ఆ || అంత ||
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘురామ ...... ఆ ఆ ఆ || అంత ||
