తోలితోలి పూజల దేవరా ...... కొలుతును నిన్ను గణేశ్వరా
చేట చెవుల దొరా ......... నా విన్నపమును చెవిని పెట్టవయ్యా
మాటికి మాటికి మొరపెట్టే నా మనవిని చే కొనుమయ్యా || తొలి ||
అంబా తనయా లంబోదర ఆలంబన మీయుమయా
మోదక హస్త మోహనకర సమ్మోదము నొందుమయా
వెనుకకు లాగుచు వెలితిని చూపే వ్యథలను బాపుమయా
పెనగొన తగిలే విఘ్న పుంజముల పెకలించుమా తనయా || తొలి ||
హాస్యల శేష గణాస్యా గణేష సులాక్ష కళా నిలయా
మూషిక వాహన దోష హరా సంతోష భావ హృదయా
పడమట పెట్టేది కుటిలపు తలపులు చటుక్కున కూల్చుమయా
నిటల నయన సుత అటు నిటు చెదరక స్ఫుటముగా కొలుతునయా || తొలి ||
No comments:
Post a Comment