ప. పూజ లందవైయ్యా గణేశా
పుడమిని కలిత బాపవయ్యా
పార్వతి తనయా పాపవిభంజన
పాహి పాహి ఓ బొజ్జ గణపయ్య ........ || పూ ||
పాహి పాహి ఓ బొజ్జ గణపయ్య ........ || పూ ||
జగముల నేలెడు జగ జట్టివిరా.....
వినుత సేతుముర మూషిక వాహన
కుడుములు ఉండ్రాళ్ళు విందు సేతు ముర
ఇడుములు బాపి శుభము లొసగరా ........ || పూ ||
భక్త పోషకా సురగణ నాయక
శక్తి నొసగరా సిద్ధి వినాయక
వారము లిచ్చి కరుణించి దీవించు
దొరవే వేరా మమ్ము బ్రోవరా ........ || పూ ||
జై గణ నాథా జై గణ నాథా
జై గణ నాథా జై గణ నాథా
జై గణ నాథా జై గణ నాథా
జై గణ నాథా జై గణ నాథా
No comments:
Post a Comment