కొండ కోనెలలో బంగారు కోవెలలో
కొండ కోవెలలో బంగారు కోవెలలో
కొలువు తీరిన కోనేటి రాయా . . . . . . . . . . .. \\ కో \\
ఏడు కొండల పైన యంతో దూ రాన వెలసిన స్వామి \\ కో \\
కలిమితో నీ చెలిమి చేద్దామంటే ......
కాసులు లేని వారము , వడ్డీ కాసుల వాడా . . .. \\ కో \\
బలిమితో నీ చెంత చేరదా మంటే
సప్త గిరుల నెక్కే సత్తువ లేని వారమూ . . . . . .. \\ కో \\
పర సత్య మెరిగి నీ సన్నిధి చేరదా మంటే
స్వార్థ చింతన తప్ప సత్వ గుణము లేదాయే . . .. \\ కో \\
కొండ కోవెలలో బంగారు కోవెలలో
కొలువు తీరిన కోనేటి రాయా . . . . . . . . . . .. \\ కో \\
ఏడు కొండల పైన యంతో దూ రాన వెలసిన స్వామి \\ కో \\