ఎంత చూసినా తనివి తీరనిది
ఎంత చూసిన తనివి తీరనిది
తిరుమలేశుని సుందర రూపం
ఎంత పాడిన మనసు నిండనిదీ
శ్రీనివాసుని నిర్మల ధ్యానం
తిరుమలేశా..... శ్రీనివాసా ......సిరులొసగేవో చిద్విలాస ....... \\ ఎ \\
కోటి సూర్య ప్రభలు నీలో కొలువు తీరే నేమో
వేల చంద్ర సుధలు నీలో వెల్లి విరిసే నేమో
వెలుగుకు వెలుగై , జ్ఞాన దీపమై వెలిగే దేవా వేంకటేశా
వెలిగే దేవా ఓ వేంకటేశా ....... ....... ....... ....... \\ ఎ \\
హార కేయూర, స్వర్ణ మకుట , సంశోభిత రూపం
శంఖు చక్ర మణి దీప్త విరాజిత మంజుల దీపం
శ్రీనివాసం శ్రిత పారిజాతం .......
తిరుమలేశం వేంకటేశం సర్వ పాప నాశనం
తిరుమలేశం వేంకటేశం సర్వ పాప నాశనం ...... \\ ఎ \\
సప్త స్వరములేమో నీకై ఏడుకొండలాయే .........
సకల జగములన్నీ నీకై రాగ జలధులాయే ........
సుధలను పంచే రాగ బంధమై ........
వెలిగే దేవా ........ ఓ వేంకటేశా ......... \\ ఎ \\
No comments:
Post a Comment