Search SakriBuddi Blog

Sunday, April 11, 2021

Andaru kalasi అందరు కలసి భజనలు చేసితె

 

 అందరు కలసి   భజనలు చేసితె 


అందరు   కలసి   భజనలు  చేసితె 

ఎందుకు  రాడే    మాధవుడు 

తాళము  చప్పుడు   చెవిలో పడితే

పరుగున వచ్చును   పరమాత్మా          \\ అ \\ 


ప్రహ్లాదుండూ    హరి  యనగా 

స్తంభము  నందుద  ఇంచెనుగా

నరహరి  నీవే  దిక్కని  వేడిన 

అభయము  నిచ్చును  పరమాత్మా       \\ అ \\ 


అహల్యా దేవి    రామా  యనగా   

రాతిని  నాతిగ  మార్చేనుగా 

భక్తితో  మనము  పిలిచిన  తోడనె 

పరుగున వచ్చును   పరమాత్మా          \\ అ \\


ద్రౌపతి   దేవి   కృష్ణా   యనగా 

వలువ  నొసగిన  పరమాత్మా 

భక్తితో  మనము  పిలిచిన  తోడనె 

అభయము  నిచ్చును  పరమాత్మా       \\ అ \\ 


No comments:

Post a Comment