ఎక్కడి మానుష జన్మం బెత్తిన
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫల మేమున్నది
నిక్కము నిన్నే నమ్మితిని చిత్తం బికనూ చిత్తం బికనూ .........
ఈ చిత్తం బికనూ ......... చిత్తం బికను ........ ......... \\ ఎ \\
మరువను ఆహారంబును మరువను సంసార సుఖమును
మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయా .....
మరిచెద సుజ్ఞా నంబును మరిచెద తత్వ రహస్యము
మరిచెద గురువును , దైవము మాధవ నీ మాయా ..... ...... \\ ఎ \\
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయా .....
విడిచెద శక్యా మోహములు విడిచెద వైరాగ్యంబులు
విడిచెద ఆచారంబులు విష్ణుడే నీ మాయా ........ ......... \\ ఎ \\
తగిలెద బహుళం పటముల తగిలెద బహు బంధమ్ముల
తగులును మోక్షపు మార్గము తలపుల యందైనా
అగపడి శ్రీ వేంకటే శ్వర అంతర్యామివై
నగి నగి, నను నీ ఏలితి నాకా నీ మాయా ................ \\ ఎ \\
No comments:
Post a Comment