అంత రంగమున వెలసిన శ్రీ చెన్న కేశవస్వామి
అంత రంగమున వెలసిన శ్రీ చిన్నకేశవాస్వామి
ఘన మైన నీ కరుణ కరువాయే మా పైనా
కనులారా కను పించగా కదలి రావయ్యా ......... ఆ ఆ ఆ ఆ \\ క \\
కను పించు దా నీవు కరువైతివా స్వామి
కల నైనా ఇలా నైనా మా కనుల కైనా
పిలచి పిలచి మేము అలసి పోతిమి స్వామి
దయ చూడు మా స్వామి శ్రీ చెన్న కేశవా ......... ఆ ఆ ఆ ఆ \\ క \\
ఆదియు నీవయ్యా అంతము నీ వయ్యా
ధర్మమూ నీవయ్యా దైవమే నీ వయ్యా
అఖి లాండమే నీవు అపురూపమే నీవు
నిను పొగడ మా తరమా నిర్మలా నందా ......... ఆ ఆ ఆ ఆ \\ క \\
కనులలో నీ వయ్యా కలలలో నీ వయ్యా
మనసులో నీ వయ్యా మాలోన నీ వయ్యా
మా గుండె లోన దైవమే నీ వయ్యా
నీ పాద సన్నిధికి దరి చేర్చుకో స్వామీ ... ఆ ఆ ఆ ఆ \\ క \\
No comments:
Post a Comment