కోడె కాడు వీడే వీడే గోవిందుడూ
కోడె కాడే వీడే వీడే గోవిందుడూ
కోడె ఇద్దరు సతుల గోవిందుడూ \\ కో \\
గొల్లె తల వలపించే గోవిందుడూ
కొల్ల లాడే వెన్నెలూ గోవిందుడూ
గుల్ల శంఖు జక్ర ముల గోవిందుడూ
గొల్ల వారింట పెరిగే గోవిందుడూ \\ కో \\
కోలచే పసుల గాచే గోవిందుడూ
కూల గుమ్మే కంసుని గోవిందుడూ
గోల వ్రేళ్ళ కొండెత్తే గోవిందుడూ
ఘాళే పుసతలు దెచ్చె గోవిందుడూ \\ కో \\
కుందనపు చేల తోడి గోవిందుడూ
గొందులూ,సందులూ దూరే గోవిందుడూ
కుందని శ్రీ వేంకటాద్రి గోవిందుడూ
గొంది దోసె నసురుల గోవిందుడూ \\ కో \\
No comments:
Post a Comment