తెలియగ తరమా శివలీలలు
తెలియగ వశమా శివ మాయలూ || తె ||
కైలాస నాథుని మహిమలూ
వైరాగ్య భరతుని చరితలూ
జగములు నేలేటి జగదీశ పరమేశ
చిత్రాతి చిత్రము నీ లీలలూ || తె ||
ముద్దుల తనయుని తల త్రుంచుట ఏమి
గజ ముఖమును ఉంచుట ఏమి
బ్రహ్మ శిరస్సును ఖండించుట ఏమి
కపాల మాలలు ధరించుట ఏమీ || తె ||
మూడవ కన్ను కలుగుట ఏమి
మూల శక్తి సగ ముండుట ఏమి
మన్మథుని కాల్చుట ఏమీ
యముని పడ వేసి చంప బోవుట ఏమీ || తె ||
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పరామృతము దేవతలకు పంచీ
గరళం కంఠాన ఉంచితి ఏమి
అన్నపూర్ణ యే చెంత నుండగా
బిక్షాటనము చేయుట ఏమి || తె ||
అడిగిన వారికి iసంపద లిచ్చీ
స్మశాన నివాస ఆంతర్య మేమో
కోరిన వారికీ కోరిక లిచ్చి
కోడె నాగును మెడకు చుట్టితి వేమి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ || తె ||
No comments:
Post a Comment