Search SakriBuddi Blog

Saturday, June 6, 2020

శివ మాల ధారణ చేసామయ్యా




హర హర  మహా దేవ          శంభో   శంకరా 



శివ  మాల   ధారణ    చేసామయ్యా    స్వామి    శివ  దిక్షా   వ్రతము   చేపట్టామయ్యా                                            

శివ  నామ స్మరణ  చేస్తున్నాము    స్వామీ  శివ   దర్శన   భాగ్యము  కై  వస్తున్నాము     ||   శి  ||

 

ఓమ్ నమః   శివాయా   ఓమ్ నమః   శివాయా    గ్రూ

                                                                                 

ఎతైన   కొండ   పైన   నీ  వున్నావు    శివ      ఎక్కడో దూరాన  మేమున్నాము

అడుగులో  అడుగేస్తూ  వస్తున్నాము   స్వామి  అడవి  నంత  దాటుకుంటూ  వస్తున్నాము     ||   శి  ||

 

హర హర  మహాదేవా  అని    అంటున్నామూ   స్వామి 

భీమ   కొలనులో  నీరు  తీసు  కున్నామూ   స్వామి  కైలాస  ద్వారమే  చేరుకున్నాము             ||   శి  ||


హాట కేశ్వర   లింగాన్ని  దర్శించాము   అయ్యా  పాలధార  పఞ్చధార పాణం చేశాము 

సాక్షి   గణపతికి  మా వివరం  తెలిపాము  శివా  పాతాళ   గంగతో  పావన  మైనాము                 ||   శి  ||


వీర భద్రుని  వీరాకృతిని  చూశాము   స్వామి  శనగల  బసవైయ్య  చెవిలో  కోర్కెలు చెప్పాము 

శ్రీశైల  లింగాన్ని  అభిషేకించాము    శివా   మహా మంగళారతిని  తిలకించాము                     ||   శి  ||


ఓమ్ నమః   శివాయా   ఓమ్ నమః   శివాయా 

 

ఓం  కార  నాదం  చెవులారా విన్నాము  స్వామి  నందీశ్వరుని  వినయం  మెం చూసాము 

వృద్ధ   మల్లికార్జుని  చూసి   సేవించాము   స్వామి   బ్రామాంబా  దేవిని  చూసి  తరించాము   ||   శి  ||


ఇరుముడిని  అర్పించి ఆనందించాము దేవా శ్రీశైల శిఖరము ద్రుశ్యంను చూచాము

శరణ మయ్యా శరణ మయ్యా శ్రీశైల మల్లన్నా మమ్ము కాపాడవయ్యా శ్రీ మాలి కార్జునా   ||   శి  ||


నాగేంద్ర  హారాయ  త్రిములోచనాయ        భస్మాంగ రాయ  త్రిలోచనాయ 

 నిత్యాయ శుద్ధాయ  దిగంబరాయ,              తస్మై నాకారాయ  ఓం నమః                        

















No comments:

Post a Comment