కైలాశాధీశుడు కరుణామయుడు
అతని సరి దైవము అవనిలో లేడు
అవనిలో లేడు || కై ||
పిలిచి నంతనే దరి చేరే సులభుడూ
శ్రుతులు శరణు కోర వరమొసగే సదయుడు
నోరార వేడిన మొర లాలించీ
లాలించి పాలించే భోళా శంకరుడు || కై ||
వేదాలకు దొరకని విభుదుడూ
తత్త్వ వాదాలకు అందని వరదుడు
యోగి బృందాలకు చిక్కని పరమాత్ముడు
భక్తి బంధాలకు లొంగి పోయి బంధీ ఆవు తాడు || కై ||
నిఖిలము కొరకు గరళము మ్రింగిన నీలకంఠుడు
మార్కండేయునికి ఆయువు నొసగిన మృత్యుంజయుడు
త్రిపురా సురులను మట్టు బెట్టిన త్రిభువన పూజితుడు
రక్కసులైన తపము చేసిన బిరాన వరాలిచ్చే దేవుడూ || కై ||
No comments:
Post a Comment