ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
శ్రీ శైల శిఖర శోభిత శివ దేవత నాథనా
సార హీన భవాబ్ది తారణ కారణా మల్లి కార్జునా || శ్రీ ||
ఓం నమో ముని పోషణా పాహిమాం సుర పోషణా
భ్రమరాంబా హృదయ సరసిజ భ్రమణ రమణా పావనా
సకల జీవము జీవ పాలన సరస కల్యాణీ ఘనా
కేళి తాండవ నాట్య నిపుణ తాళ రాగ ప్రియాచనా
అరుణ కిరణవ శుభా చరణ అసుర లోక ప్రణాశనా || శ్రీ ||
మోక్ష దాంబిక జనప్రధాన మోహ వారణ మోహనా
సూర్య వంది శశాంక లోచన కార్య సిద్ధి ప్రచోదనా జటా జూట విలాస గంగ కలిల యుగ శశి భూషణా
ఫాల లోచన జనిత శీలా పటిల లభ్ది భూత మథనా || శ్రీ ||
శ్రీ శైల శిఖర శోభిత శివ దేవత నాథనా
సార హీన భవాబ్ది తారణ కారణా మల్లి కార్జునా || శ్రీ ||
ఓం నమో ముని పోషణా పాహిమాం సుర పోషణా
No comments:
Post a Comment