ఎంతో చక్కని దేవుడూ అంతే చిక్కని దేవుడూ || ఎం ||
బ్రహ్మ విష్ణు దేవతలకు అంతు దొరకని దేవుడూ
అంతో యింతో ఎంతో ఎంతెంతో
భక్త సులభుడైనాడు భక్త ప్రియు డీతడూ భోళాశంకరు డితడు || ఎం ||
దేవాది దేవా ఓ మహాదేవ దీన భాందవా మా పాలి దేవా గ్రూ
చక్కనైన చంద్రుని శిరసున ధరిరించి నాడు
చల్ల నైనా గంగను శిగన ముడి వేసినాడు
విభూతి ధారణ తో వెలిగి పోతున్నాడు
నాగా భరణాలతో మెఱసి పోతున్నాడు
ఢమరుక నాదం చేస్తూ శంఖాన్ని పూరిస్తూ
ఓం కార నాదం తో ఆంనంద తాండవం చేస్తున్నాడు || ఎం ||
దేవతలు దానవులూ పూజించే దేవుడూ
మునీశ్వరులు అందరూ ధ్యానించే దేవుడూ
పిలిచిన వెంటనే పలికేటి దేవుడూ
ఎవ్వరిని కాదనడు ఎవ్వరికీ లేదనడు
భక్తుల సేవకు మెచ్చి అడిగిన వరములు నిచ్చి
అపురూప బంధం తో బంధీ ఆవు తున్నాడు
భక్తవ శంకరుడు ఈ భక్తవ శంకరుడు || ఎం ||
ఎంతో చక్కని దేవుడూ అంతే చిక్కని దేవుడూ
బ్రహ్మ విష్ణు దేవతలకు అంతు దొరకని దేవుడూ
అంతో యింతో ఎంతో ఎంతెంతో
భక్త సులభుడైనాడు భక్త ప్రియు డీతడూ భోళాశంకరు డితడు || ఎం ||
భవ హరుడు, పురహరుడు, శశిధరుడు, ఈ శివుడు గ్రూ
No comments:
Post a Comment