పాడెద శివ నామ సంకీర్తనం పడేద శివ సేవలో జీవనం
నంది వాహనుని నాగా భరణుని కైవల్య మొసగే కైలాస వాసుని
కనులారా వీక్షించి కరములు జోడించి గళ మును సవ రించి
పాడెద పాడెద || పా ||
నీ సేవలో నీ పూజలో నీ స్మరణతో నీ కీర్తనతో
ధన్యు లైన భక్తు లెందరో పునీతు లైన జీవులు ఎన్నో
దేవాది దేవా ఓ మహా దేవా ఈ బ్రతుకు నావ నీ సేవలో బ్రోవా || పా ||
భస్మా సురునికి వరములు నిచ్చావు బాణా సురుని ఇంటిని గాచావు
మల్లమ్మ భక్తికి మెచ్చీ కన్నప్ప భక్తికి నచ్చీ
ముగ్దుడవై నావు ముచ్చట పడ్డావు కరుణా భరణా నే నిన్ను మరువక || పా ||
నా గుండెలో నా గొం తులో నా శ్వాసలో నా ధ్యాసలో
నా లో అణు అణువు నీవే నా లో గానం లో ప్రాణం నీవే
లయా కారకా త్రిభువన పాలకా ఈ జన్మ చాలిక మరు జన్మ వల దిక || పా ||
No comments:
Post a Comment