Search SakriBuddi Blog

Tuesday, June 9, 2020

శరణం శరణం దేవా




  • 5. శరణం  శరణం  దేవా 


        శరణం  శరణం  దేవా  శరణం    స్వామి గణనాథా 
        గౌరీ నందన  గజ ముఖ  వదనా శరణము నీయవయా

        శ్రీ కర శుభకర  సుందర  వదనా  స్వామి  గజవదనా 
        ముందు  పూజలు నీకు సేయగ   శుభములు నొసగేవు 
        విఘ్నేశా  శుభములు నొసగేవు  

        వికసిత  వదన  విమల నయన  శివ పార్వతి  తనయా 
        నీ శుభ నామము స్మరించిన కలుగును విజయములు  
        విఘ్నేశా  కలుగును విజయములు 

        ఏక దంతం శూర్పకర్ణం   పాలచంద్రయా 
        మూషిక  వాహన  మునిజన  వందిత   విఘ్న వినాయకా 
        విఘ్నేశా  విఘ్న వినాయకా 

        భక్తితో   చేరి  భజనలు  చేసే  భక్తుల  బ్రోవు మయా 
        లోక  పూజిత   లోక  శరణ్యా  గణముల  కధిపతివే  
        గిరిజా  నందన  నిత్య  నిరంజన  విఘ్న  రాజాయా 

        ప్రథమ గణాలకు  దైవము  నీవై     ప్రభవించి  నావయ్యా  
        విఘ్నేశా  ప్రభవించి  నావయ్యా 

        ఆశ్రిత  వదనా  అభయ స్వరూపా   ఆనందా నిలయా  
        చిత్తము లోనా   నిన్నును నిలుపగా   చింతలు మాకేలా
గణేశా చింతలు మాకేలా
        
        సర్వ  జనోద్బవ  సంకట హరణ   దీన  జనా వనా 
        నిన్ను నమ్మిన చాలు నయ్యా  అభయము  నిచ్చెదవూ      
        విఘ్నేశా  అభయ నిచ్చెదవూ

   
    
        
కోటి  భక్తుల  కొంగు  బంగారమై   కోర్కెలు  తీర్చెదవూ 
నీదు  మహిమలు  నేను  పొగడగ  యిలలో మా తరమా `                
దాసుల  బ్రోచే   సద్గురు  నాథా  కావగ   రావయ్యా 
శాంతి  సౌఖ్యము  లందించే  చల్లని  దోరా నీవే 
విఘ్నేశా  చల్లని  దోరా  నీవే 


విఘ్న  నివారణ  విద్యా   దాతా   ప్రథమ   గణా ధిపా
సిద్ధి   బుద్దుల   దేవి  ముద్దుల  సుందర   గణ  నాథా 
గణేశా   సుందర   గణ  నాథా 


ఎలుక  నెక్కి   ఊరే గేటి    ముద్దుల  గణ పయ్యా 
కుడుములు  ఉండ్రాళ్ళు  నీకే   ఇడుములు బాపయ్యా 
విఘ్నేశా  ఇడుములు  బాపయ్యా


పార్వతి నందన   పావన చరణా   పాప  విమోచనా 
నిన్ను తలచిన   చాలును దేవా    సుఖములు మా  పరమూ 
గణేశా   సుఖములు  మా  పరమూ 


వెండి  కొండపై  నిండుగా నెలసిన  స్వామివి  నీవయ్యా
నమ్మి  కొలిచే  ప్రియా  భక్తులకూ  దైవము నీవయ్యా
విఘ్నేశా  దైవము నీవయ్యా


నీదు  వ్రతము  ఆచరించగ  వ్యథలను   బాపెదవూ  
ముడుపులు  నీకు చెల్లించగనే   మోదము   గూర్చెదవూ    
గణేశా   మోదము  గూర్చెదవూ 


చేతులెత్తి    నీకు మ్రొక్కి   సేవించెద  మయ్యా 
గణ  నవరాత్రులు  పూజసేయఁగ  వరములు  నొసగేవూ 
విఘ్నేశా   వరములు   నొసగేవూ 













ప్రథమ  పూజితా  ప్రమథ  నాయకా  పరమేశ్వర తనయా 
గరిక, పత్రీ    పూజలు మెచ్చి    చల్లని  దేవు డవూ
గణేశా  చల్లని  దేవు డవూ


హే  లంభోదర   హే  రంభాయా  హే  గజ వదనాయా 
 కాణి   పాక   వర  సిద్ధి  వినాయక   స్వామి  మమ్మేలూ
 విఘ్నేశా    స్వామి  మమ్మేలూ


గజ  కర్ణాయా   గజ  వదనాయా   గుజ్జు  రూపాయా
అండము  లలకా    ఆది దేవా    స్వామీ   గణనాథా
గణేశా   స్వామీ  గణనాథా 


అనాథ  రక్షక    ఆపత్  బాంధవ   ఆది  వినాయకా 
అవని  లో    తేజంబు   నీవే    సత్య   స్వరూపా 
విఘ్నేశ  నీవే   సత్య  స్వరూపా 


ప్రసన్న  వదనా   హే  గజాననా    షణ్ముఖ   సోదరా 
ఆది  మూలా    మహా గణేశా    అఖిలము    నీవె  కదా
గణేశా  అఖిలము   నీవే  కదా 


గణాధి  నాయక   మహా  బలాయా   గణ  నీయా  చరితా 
చతుర్భుజాయా   వజ్రా కిరీటాయా   వందనము  దేవా 
విఘ్నేశా    వందనము    దేవా 


త్రినేత్ర   తనయా   త్రిదోష   రహితా   త్రిభువన  సంచారీ 
మము   దయగనుమా     దేవ దేవా    స్వామీ  గణనాథా 
గణేశా    స్వామీ   గణనాథా 


శాంతి   స్వరూపా    ప్రేమ స్వరూపా   అగణిత  గుణ ధామా 
ఆది   పూజలూ     నీకు  సేయగ       పరమానందమయా 
విఘ్నేశా     పరమానందమయా 


సుగుణ   మందిర    సురా  గ్రజాయ   సువర్ణ  దేహాయా  
సుందర   వద  నయన    శుభకర చరణా    పరిపూర్ణ   హృదయా  
గణేశా  పరిపూర్ణ   హృదయా  







పరమ దయానిధి   సకల కళానిధి   నీవే  మానిధీ 
పావన గంగా   పరుగున  రారా   స్వామీ  గణపయ్యా 
విఘ్నేశా   స్వామీ  గణపయ్యా


నీ  గుడిలో   జే  గంటలు  మ్రోగగ   గ్రహ బాధలు  తొలుగూ 
నిను  కీర్తించిన    చాలు  నయ్యా    సకలము శుభములుగా 
గణేశా   సకలము  శుభములుగా

పూజలు సేతుము    పువ్వుల తోడ    ప్రేమకు  కానుకగా 
జీవన్ముక్తికి    మార్గము  నీవే    స్వామీ  గజవదనా 
విఘ్నేశా   స్వామీ  గజవదనా 


మధురం మధురం  నీ శుభ  నామం   స్వామీ  గణ  నాథా 
మధురాతి   మధురం   నీ  ముఖ  బింబం  దేవా  గణనాథా 
గణేశా    దేవా  గణాధిపా 


దీన   భాంధవా  దీన  శరణ్యా   దివ్య  స్వరూపాయా 
అఖిలాండ   కోటి   బ్రహ్మాండ    సజ్జన  సంరక్షా  

విఘ్నేశా    సజ్జన  సంరక్షా

No comments:

Post a Comment