నమో నమో శివ శంకర హర హర
భవ హర రారా హరోం హరా
నిండు మనసుతో దం మిడిసితిమి
కావవేమిరా గంగాధరా || నమో ||
కాలుని కర్కశ పాశము పాలకు
మార్కండేయుని బ్రోచుతివే
పరమ భక్తుడు చిరు తొండునికి
కరుణతో మోక్షము యిచ్చితివే
ఫాలనేత్ర నే పాపి నిర్దోషిని
పాలింపుమురా హరోం హరా || నమో ||
సతి సుతు లను చును
భవసాగరమున ఈదలేక నే బడలితిరా
వేదనతో నిను వెదికి వేదికి నా
భాదను తెల్పితి దయగన రారా
శంభో శంకర భక్త శుభంకర
పాహి పాహి హరోం హరా || నమో ||
పసిడి కాంతని యిచ్చెదమన్నా
మేరువు పీఠమై యున్నదిరా
పూలను పూజతో పూజింతు మన్నా
సురభి సుమంగులు కూడెనురా
భాగ్య రాశి ఏమివ మన్న
తీర్థ మిచ్చెదను హరోం హరా || నమో ||
No comments:
Post a Comment