ఈ జగమంతా ఈశ్వర మయం
సదా శివా త్మకం
పంచాక్షరీ పావన మంత్రం
త్రిలోక పాలకం || ఈ ||
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఆతని రూపాలే అంతయు
ఆతని నామాలే అన్నియూ
పారే నదులే పాద తీర్థములు
కర్మలు లన్ని కై కంకర్యములు || ఈ ||
అతని చూపులే అఖిల తేజములు
అతని శ్వాసములే అనిలములు
ఆకాశ పథమే అతని కపర్దము
అవని తలమీ యాంగ్రీ పీఠము || ఈ ||
అతని నామాలే స్వరములు
ఆతని నవ్వులే అలరులు
సర్వ కార్యములు సంకల్పములు
చరాచరమ్ములు హర విలాసములు || ఈ ||
No comments:
Post a Comment