అవనిని మోయుచున్న ఆదిశేషా
అవనిని మోయుచున్న ఆదిశేషా
నీకు అలుపన్నదే లేదు పన్నగేశా
వేయి తలలున్న భుజాగేశ్వరా
నిన్ను వేడెదము అభయ నిమ్ము మురుగేశ్వరా \\ అ \\
ఎన్నెన్నో రూపాలు గొనుచుందువూ
కన్నులతో కనుచుండి వినుచుందువూ
పరమాత్మా సేవలకే అంకితమూ
సత్య భక్తిచే ధన్యము నీ జీవితము \\ అ \\
తర తమ భేదాల తలపున రానీవు
హరి హర ఒక రనుచు ఇరువురిని కొలిచేవు
ప్రభువైన శ్రీపతికి తల్పవు నీవే
నట రాజైన శివునికి అలంకార మీవే \\ అ \\
వాసుకి అయినావూ పాల కడలి తరచినావు
నీ లీల అద్భుతాలు నీకు వేల వందనాలు
ఆగ్రహమే వలదయ్యా నాగదేవా
ఆపదలూ రానీక బ్రోవు మయ్యా .. \\ అ \\
ఆది శేషా పన్నగేశా ఆది శేషా పన్నగేశా
ఆది శేషా పన్నగేశా ఆది శేషా పన్నగేశా
ఆది శేషా పన్నగేశా ఆది శేషా పన్నగేశా \\ అ \\