భవ సాగరమున పుట్టిన నేనూ…
భవ సాగరమున పుట్టిన నేనూ
నీ చెంత కెలా రాగలనూ క్రిష్ణా . . . . .
అవ గుణములతో నిండెను నామది
ఆరతి గాన నిలు వను కృష్ణా \\ నీ \\
విషయ వికారము నిండిన మందికి
మలినమే ఈ జగమంతా .........
తడబడు అడుగులు, పడుతూ లేస్తూ
ఓ దార్పులకై చూశాను క్రిష్ణా
నీ చెంత కెలా రాగలనూ క్రిష్ణా . . . . . . ..
అవ గుణములతో నిండెను నామది
ఆరతి గాన నిలు వను కృష్ణా \\ నీ \\
పూజార్చన తెలియని నేనూ
నిన్నెలా ధ్యానించ గలనూ
సర్వము తెలిసిన అంతర్యామివి
నీవే జగతికి మోక్షం
నీ కృప ధృష్టి నాపై పడితే
ధన్య జీవనం తానూ క్రిష్ణా . . . . .
మాయని ఓడిస్తానూ క్రిష్ణా --
మాయని ఓడిస్తానూ క్రిష్ణా
నీ చెంత కెలా రాగలనూ క్రిష్ణా . . . . .
అవ గుణములతో నిండెను నామది
ఆరతి గాన నిలు వను కృష్ణా \\ నీ \\
భవ సాగరమున పుట్టిన నేనూ
నీ చెంత కెలా రాగలనూ క్రిష్ణా . . . ..
అవ గుణములతో నిండెను నామది
ఆరతి గాన నిలు వను కృష్ణా \\ నీ \\
No comments:
Post a Comment