తెలిసిన వారికి తెరువిదే మరి లేదు
తెలిసిన వారికి తెరు విదే మరి లేదు
నళినాక్షు పొగడెడి, నామ ములో ఉన్నదీ \\ తే \\
తెలిసిన వారికి తెరు విదే మరి లేదు
ఆకశాన లేదు మోక్ష, మటు పాతాళమున,
లే దీకడ భూలోక మందు ఎందూ లేదూ .......
పైకొని ఆశ లెల్ల పారద్రోల వెదికితే .....
శ్రీ కాంత పొగ డేటి చిత్తములో నున్నదీ …. \\ తే \\
సురల వద్ద లేదు, శోధించి నమృతము
సరి దిక్కులందు లేదు, జలధిలో లేదూ
శరణాగతుల , పాద జలముల చేర్చికొని
హరి దాసుల పూజించే, అరచేత నున్నదీ…. \\ తే \\
రాజా సాన సుఖ మేదీ, రాశి ఖర్మ మందు నేదీ
వోజ తొడ నియతుడై ఉండేనా నీదీ
సాజాన వేంకటేశు సరి ముద్రలు ధరించే
తేజముతో విజ్ఞాన, దేహములో వున్నదీ ..... \\ తే \\
తెలిసిన వారికి తెరు విదే మరి లేదు
నళినాక్షు పొగడెడి, నామ ములో ఉన్నదీ \\ తే \\
తెలిసిన వారికి తెరు విదే మరి లేదు
No comments:
Post a Comment