నమో నమో శ్రీ వేంకటేశా
నమో నమో శ్రీ వేంకటేశా
నమో నమో శ్రీ వేంకటేశా
శరణంటి శ్రీ శ్రీనివాసా
శ్రీ వేంకటాద్రి శ్రీ శ్రీనివాసా \\ న \\
కలియుగ వరద కరుణించ రావా
కష్టాల కడలిని దాటించ లేవా
కలనైనా మరువను నీ నామ స్మరణం
ఇల లోన నీకంటే నా కెవరూ శరణం \\ న \\
హరినామ స్మరణం మరువని నేనూ
గిరు లన్ని దాటి రాలేను నేనూ
కరుణించి ఒక సారి కను పించు స్వామీ
కనులారా నిను గాంచు వర మీయ వేమీ \\ న \\
నమో నమో శ్రీ వేంకటేశా
నమో నమో శ్రీ తిరుమలేశా
శరణంటి శ్రీ శ్రీనివాసా
శ్రీ వేంకటాద్రి శ్రీ శ్రీనివాసా \\ న \\
No comments:
Post a Comment