బృందావనిలో నంద నందనుని ......
బృందావనిలో నంద నంద నుని మురళి గానం మ్రోగినదీ ........ 2
మ్రోగినదీ ........
ప్రభువు తనకై మురళి పలికించే నని మురిసే రాధికా ........ 1
విభుడు తన కెదురుగా వేణువు ఊదె నని ఎంచే గోపికా ........ 1
ప్రతివారూ తమకోసంపలికె పిల్లనా గ్రోవి అరుదు తలచిరి . . . . . . . . 1 \\ బృ \\
ఈ నాదం, వేదం అని తలచె సంగీత కోవిదులూ ...... 1
ఈ గానం, ధ్యానం అని ఎంచె వేదాన్త విధులూ......... 1
కలరావము విని, పులకింత ను గని, తలకొక విధముగ తలపోయా .... 1 .\\ బృ \\
ఏ, ఒకరికో, అంకితం, ఎన్నడూ కానిది, ఎల్లర స్వంతమై యున్నదీ 2
అన్నియు తానై అందరికి ఆలపించే శబ్ద బ్రహ్మ మిది 2
బృందావనిలో నంద నంద నుని మురళి గానం మ్రోగినదీ ........ 2 \\ బృ \\
మ్రోగినదీ ........
No comments:
Post a Comment