Search SakriBuddi Blog

Monday, March 8, 2021

ముద్దు కృష్ణ రారా ముకుంద రారా

 

ముద్దు కృష్ణ రారా  ముకుంద  రారా

ముద్దు  కృష్ణ    రారా      ముకుందా     రారా 

చిన్ని    కృష్ణ      రారా      సేద  తెవెర్చు   కోరా   . . . . . . .    \\ ము \\       


చిలిపి  చేష్ట   వదిలి  పెట్టి    చిన్ని   కృష్ణ    రారా 

గోరు ముద్ద   ఆరగించ       గోవిందా          రారా 

ఆటలాడి    అలిసి  నావు   అలుపు  తీర్చు  కోరా  

పిలిచిన   వినిపించు  కోవు   పిచ్చి  తండ్రి   రారా   . . . . . . .   \\ ము \\


మన్ను తింటి  వనుచు    నిన్ను మంద  లించ  బోను  

వెన్న  దొంగ    వనుచు    నిన్ను   దీవించ       బోను 

కన్న  తండ్రి     వనుచు    నిన్ను కనుల  అద్దు  కొందు

కనకపు  గిరి    వనుచు    నిన్ను  కౌగలించు     కొందు   . . .. \\ ము \\  


మదిని  మంది రమ్ముగా  జేసి  వేచి  యుంటి నయ్యా 

మోము  చూపి   మోసగించి   పోబోకు         మయ్యా 

ముద్దు ముద్దు మాటలాడి  ముదము గూర్చ వయ్యా 

వదలక  నా వడిన  చేరి      సుధను   చిలక   వయ్యా      . . .. \\ ము \\

No comments:

Post a Comment