మా ఇంటి దేవుడూ శ్రీ నివాసుడూ
మా ఇంటి దేవుడూ శ్రీ నివాసుడూ
మా తోడు నీడా వేంకటేశ్వరుడూ …. \\ మా \\
ఏడేడు లోకాలు యేలేటి వాడూ
ఏడూ కొండల వాడు కలియుగ వరదుడు
కొండల్లో వెలిశాడు గుండెల్లో ఉన్నాడు
మా బండ బ్రతుకులనే పండించి నాడు \\ మా \\
కన్నీటి చింతలన్నీ తొలగించే వాడు
కోనేటి చెంతలో కొలువై వున్నాడు
శతకోటి నామాల పలికేటి దేవుడూ
జన కోటి క్షేమాలు రాసే మహాత్ముడు \\ మా \\
తిరుమల లో తిరుగాడే తీరైన దేవుడు
తిరుపతి లో వైకుంఠం తీరిచి నా డతడూ
తిరు వెంగళ ఊరేగి తిమిరము లెడబాపి నాడు
తిరు నామం కలవాడు తిరు వేంకట నాథుడూ \\ మా \\
మా ఇంటి దేవుడూ శ్రీ నివాసుడూ
మా తోడు నీడా వేంకటేశ్వరుడూ …. \\ మా \\
No comments:
Post a Comment