చిన్నికృష్ణా చేర రావా చిన్ని నాన్నా
చిన్ని కృష్ణా చేర రారా చిన్ని నాన్నా
కన్న తండ్రీ వెన్న ఇదిగో వేగ రావా
ఉన్న వెన్నంతా నీ కేనురా,
తన మన్నంతా తిన బోకురా \\ చి \\
గొల్ల వారి వాడ చేరి గోల చేయకూ, ......
అల్లరి ఏమీ చేయకూ
వేళ కానీ వేళ నీవూ కొల్ల నాడకూ,
నల్ల నయ్యా వేధిం చకూ
చెల్లు బాటు కాదురా, చిన్న తనము వీడరా
ఉన్న వెన్నంతా నీ కేనురా,
తన మన్నంతా తిన బోకురా \\ చి \\
భామ లంతా కోనేటి స్నాన మాడంగా .
చీర లెత్తు కెళ్యావటా
భక్తి తొడ భామ లంతా మ్రొక్కి వేడగా
చెట్టు ఎక్కీ ఉన్నావటా
ఎట్టా గయ్యా కన్నయ్యా .. కానీ పనులు వాడలో
ఉన్న వెన్నంతా నీ కేనురా,
తన మన్నంతా తిన బో కురా \\ చి \\
ఉట్టి మీద చట్టి దించి జత గాళ్లతో
వెన్నంతా తిన్నా వటా
గట్టి గాను కొట్ట బోతే పట్టు చిక్కకా
తప్పించు కున్నా వటా
కంద బాలా ఎందుకో నగు బాటు వాడలో
ఉన్న వెన్నంతా నీ కేనురా,
తన మన్నంతా తిన బో కురా \\ చి \\
No comments:
Post a Comment