గోపాల కృష్ణయ్య వచ్చినాడూ ......
గోపాలా కృష్ణయ్యా వచ్చినాడూ
కొండంత వెలుగునే తెచ్చినాడూ \\ గో \\
కొండంత వెలుగునే తెచ్చినాడూ గ్రూ
మురళి చేత పట్టుకొని నెమలి ఫించం పెట్టుకొని
గొల్ల తనల గుండెలలో కొల్ల గొన్న వాడూ \\ గో \\
కొండంత వెలుగునే తెచ్చినాడూ గ్రూ
నల్ల నైన వాడైనా .... మల్లెపూవు మనసూ ..
యెంత వారికైనా సరే మంత్రించే సొగసూ
వెన్నెలతో పాటుగా వన్నెల కన్నే యలను
దొరా లాగా దోచు కొనే దోర వయసూ \\ గో \\
కొండంత వెలుగునే తెచ్చినాడూ గ్రూ
అప్పుడే విచ్చి నట్టి కలువ పూల వంటి
చెప్ప లేని సొగసైనా కన్నుల వాడూ
కట్టి రెండ లోనైనా అత్తిన గంధంలా
సేద తీర్చు చల్లని నవ్వుల వాడూ \\ గో \\
కొండంత వెలుగునే తెచ్చినాడూ గ్రూ
అతడూ మసలే చోటా అర విరియును పూదోట
అతని అడుగు వేదాలకు గొడు గంటా ఆఆ ఆఆ
నీలి మెరుగు మేఘాలకు మెరుపు పంటా \\ గో \\
కొండంత వెలుగునే తెచ్చినాడూ గ్రూ
గోపాలా కృష్ణయ్యా వచ్చినాడూ
కొండంత వెలుగునే తెచ్చినాడూ \\ గో \\
కొండంత వెలుగునే తెచ్చినాడూ గ్రూ
No comments:
Post a Comment