శ్రీ అన్న మాచార్య హృదయేశా
శ్రీ అన్న మాచార్య హృదయేశా
శ్రీ వేంకటాద్రీశ జగదీశా || శ్రీ || 2
భువనైక లోకేశా శ్రీధరా భవనాశ
గరుడాచల స్థిరవాసా భూమీషా || శ్రీ ||2
సుర ధామ, శుభ నామ, శ్రీ రామ పరంధామ
శ్రిత లోక పరి పాల నిజ భక్త పరి పోషా 2
అహ మహో దయ దేవ నారాయణాద్రీశా
నీల గాత్ర వరద నమస్తే గోవిందా || శ్రీ ||2
ప్రణవాoభుధి శయనేశా పావన గుణ శాంత గుణ
భవ సాగర జన పోషా అంబి కాతి లోక 2
గోవింద గోపాల గోవర్ధన గిరిదారే .....
కనకాచల నాయకా వందనం మహా ప్రభో || శ్రీ ||2
మృదు పాద నవ యుగళ సకలార్చిత శుభ చరితా
పద్మ దళాయ తాక్ష వైకుంఠ పురవాసా 2
దైత్య నాశక దేవా దానవ మద సంహార
ప్రహ్లాద వరదాది శేషాద్రి పుర వాసా || శ్రీ || 2
శ్రీ అన్న మాచార్య హృదయేశా
శ్రీ వేంకటాద్రీశ జగదీశా 2
భువనైక లోకేశా శ్రీధరా భవనాశ
గరుడాచల స్థిరవాసా భూమీషా || శ్రీ ||2