బంగారు వాకిలిని తెరిపించవయ్యా
బంగారు వాకిలిని తెరిపించవయ్యా
వైకుంఠ వాసా శ్రీ వేంకటేశా || బ ||
బంగారు వాకిలిని తెరిపించవయ్యా
కొండ లెన్నో ఎక్కి కోటి నాదము పలికి
నిను చూడ ఈ తనువు నిలిచేను స్వామీ || బ ||
ముని, యోగివరు లతో ముచ్చటలు చేశావా
ప్రహ్లాదు డేమైనా పరి చర్య చేసెనా || బ ||
ఫణి రాజు నిను నిలిపి కీర్థింప దొడగెనా
పాద సేవల పత్ని నిను నిలిపి వేసెనా || బ ||
దేవాది దేవా....... వైకుంఠ వాసా .....
తలుపు తీయుము స్వామి కమలాప్త బంధో || బ ||
బంగారు వాకిలిని తెరిపించవయ్యా
No comments:
Post a Comment