మధురం మధురం గోవింద నామం …
మధురం మధురం గోవింద నామం
మధురం మధురం గోవింద నామం
స్మరణం మధురం అతి మధురం
హరి ఓం హరి ఓం నారాయణా || మ ||
అన్నమయ్య గీతం త్యాగరాజ కీర్తనం
క్షేత్రయ్య పద నర్తనం రామదాసు గానం
పద దాసుల జీవనం సవి గాయక భావం
కురిపించే మధురా మృతం || మ ||
బ్రహ్మము తానే మర్మము తానే
వేదము, నాదమూ స ర్వం తానే
భగవత్ ద్గీతార్ధం, భగవత్ భాష్యం
రామాయణ పరమార్థం ..... || మ ||
యుగమున కొక పరి ప్రభవించు దైవం
జగమున కొక సిరి కురుపించు దైవం
దుష్ట శిక్షణ కోసం ధర్మ రక్షణ కోసం
వెలసిన కలియుగ దైవం || మ ||
No comments:
Post a Comment