Search SakriBuddi Blog

Tuesday, August 4, 2020

శంఖు చక్ర నామాలు ధరించి నావా

శంఖు చక్ర  నామాలు  ధరించి నావా


శంఖు  చక్ర   నామాలు   ధరించి   నావా 

దుష్ట    శిక్ష     నార్థము    వెలసిల్లి  నావా                           || శ  ||  

ఏడు   కొండల  పైన   కొలువు  తీరి నావా 

తిరుమల   గిరి  పైన  వెలుగొంది     నావా                        || శ  || 


ఆపద   మొక్కుల  వాడని  పేరెందు   కయ్యా 

ఆపదలు  మము   గాంచక  ఊరకుంటి  నయ్యా 

నీవే  దిక్కని  నమ్మిన   మమ్ము  కాపాడ  వయ్యా 

కలలోనా  యిలా లోనా  నిన్నే  స్మరింతు నయ్యా           || శ  || 


రొవ్వంత   దయ  చూపిన  కొండ  లేమి  కరిగి పోవు 

కరుణించి  కాపాడిన    కరుణ  అంత  కరిగి పోదు            

కష్టాల ఊబిలోన     మునిగి  పోతున్నాము 

కడలి  వోలె   నావ  వోలె   కలత చెందు  చున్నాము       || శ  || 


నిత్యా    లంకారముతో     స్వర్ణ   గోపుర  నీడలో 

సకల     భోగ   భాగ్యాలు   అనుభవించు   చున్నావు

నిలువు  నీడ   లేని   మాకు   తోడుగా    రావయ్యా

నిఖిలాత్మ   నీ చెంత   నలుసు నై   ఉంటనయ్యా            || శ  || 


No comments:

Post a Comment