కలియుగ వరదుని క్షేత్రము తిరుమల
కలియుగ వరదుని క్షేత్రము తిరుమలా
కరుణా మయుని కాంతులు మిలమిలా || క ||
వృషభాద్రి , గరుడాద్రి, శేషాద్రి, నీలాద్రి
అంజనాద్రి , వేంకటాద్రి , నారాయణాద్రి.....
అరుదైన తిరుమలా అందాల గిరిమాల
ఆ ఏడు కొండలు పరిమళ తిరుమలా || క ||
తుంబుర తీర్థం, ఆకాశ గంగా, భూగర్భం
చక్ర తీర్థం, స్వామి పుష్కరిణీ
వేయేల తీర్థాల తిరణాల వరమాల
తీరైన బ్రతుకిచ్చు తీయని హరి మాల || క ||
సుప్రభాత, తోమాల, పూలంగి అర్చనలూ
గరుడోత్సవ రథ, బ్రహ్మోత్సవాలూ
శ్రీ వారి సేవలూ, బంగారు శాల
నిత్య కల్యాణం, మంగళ స్వరమాల || క ||
No comments:
Post a Comment