నారాయణతే నమోనమో భవ నారద సన్నుత
నారాయణతే నమో నమో
నారాయణతే నమో నమో
నారాయణతే నమో నమో
భవ నారద సన్నుత నమో నమో..... || నా ||
మురహర నగధర ముకుంద మాధవ
గరుడ గమన పంకజ నాభా
పరమ పురుష భవ భంజన కేశవ
నర మృగ ధర నమో నమో || నా ||
జలధి శయన రవి చంద్ర విలోచన
జలరుహ భవనుత చరణ యుగా
బలి బంధన గోవర్ధన వల్లభ
నలి నోద్ధరతే నమో నమో || నా ||
ఆది దేవ , సకలాగమ పూజిత
యాదవ కుల మోహన రూపా
వేదోద్ధర .........
వేదోద్ధర శ్రీ తిరువెంకట నాయక
నాద ప్రియతే నమో నమో || నా ||
No comments:
Post a Comment