అంతయు నీవే హరి పుండరీ కాక్ష
అంతయు నీవే హరి పుండరీ కాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘు రామా ఆ ఆ ఆ || ఆ ||
అంతయు నీవే హరి పుండరీ కాక్ష
కులమును నీవే గోవిందుడా
నా కలిమియు నీవే కరుణానిధీ
తలుపును నీవే ధరణీ ధరా
నా నెలవును నీవే నీరజ నాభా || ఆ ||
తనువును నీవే దామోదరా
నా మనికియు నీవే మధుసూదనా
వినికియు నీవే , విఠలుడా
నా వెనుక ముందు నీవే , విష్ణు దేవుడా || ఆ ||
పుట్టుగు నీవే పురుషోత్తమా
కొన నట్ట నడుము నీవే నారాయణా
ఇట్టే శ్రీ వేంక టేశ్వరుడా
నాకు నెత్తున గతి ఇంక నీవే నీవే || ఆ ||
అంతయు నీవే హరి పుండరీ కాక్ష
చెంత నాకు నీవే శ్రీ రఘు రామా ఆ ఆ ఆ || ఆ ||
అంతయు నీవే హరి పుండరీ కాక్ష
No comments:
Post a Comment