ఏమి సౌందర్యము ఏమి గాంభీర్యమూ
ఏమి సౌందర్యము ఏమి గాంభీర్యమూ
ఏమి సౌందర్యము ఏమి గాంభీర్యమూ
ఏడు కొండల వాని నిండైన విగ్రహము || ఏ ||
ఏమి సౌందర్యము ఏమి గాంభీర్యమూ
ఇరు వైపులా శంఖు చక్రంబు లవిగో
పాము పడగల సొమ్ము అందాలు అవిగో
దయ పొంగు, ఎదపైన దేవేరు లవిగో
అంగాంగమున వెలుగు మని మాల లవిగో || ఏ ||
పాద పద్మము చూపు పద్మ హస్తం అదిగో
శరణా గత త్రాణ వర హస్త మదిగో
బ్రహ్మ కడిగిన పద్మ పాదమ్ము లవిగో
ఎతైన వైకుంఠ మకుటమ్మే అదిగో || ఏ ||
No comments:
Post a Comment