గరుడ గమన గరుడధ్వజ
గరుడ గమన గరుడధ్వజ నర హరి నమో నమో || గ ||
కమలా పతి కమల నాభ కమలజ జన్మ కారణిక
కమల నయన కమలాప్త కుల
నమో నమో హరి నమో నమో || గ ||
గరుడ గమన గరుడధ్వజ నర హరి నమో నమో
జలధి బంధన, జలధి శయనా
జలనిధి మధ్య , జంతుకల ..
జలధి జా మాత, జలధి గంభీర
హలాధారా నమో నమో హరి నమో నమో || గ ||
గరుడ గమన గరుడధ్వజ నర హరి నమో నమో
ఘన దివ్య రూప, ఘన మహి మాంక
ఘన ఘనా, ఘన కాయ వర్ణ
అనఘ, శ్రీ వేంక టాధి పతేహం
నమో నమో హరి నమో నమో
గరుడ గమన గరుడధ్వజ నర హరి నమో నమో || గ ||
No comments:
Post a Comment