బ్రహ్మోత్సవం యిది బ్రహ్మోత్సవం
బ్రహ్మోత్సవం యిది బ్రహ్మోత్సవం
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం || బ్ర ||
తిరుమలేశుని గాంచు బ్రహ్మోత్సవం
తిలికించు వారికిది దివ్యో త్స వం || బ్ర ||
షాద్రి వాసునికి శేష వాహన సేవ
కంస వైరికి జరుగు హంస వాహన సేవ
చంద్ర కాంతుల దొరుకు చంద్ర ప్రభల సేవ
అంజనా ధీశునికి హనుమంత సేవ || బ్ర ||
గరుడాద్రి వాసునికి గరుడ వాహన సేవ
విశ్వరూపుని కిదే అశ్వ వాహన సేవ
కరిని గాచిన దొరుకు గజ వాహన పు సేవ
భువనాభి నాథునికి ఘన రతోత్సవ సేవ || బ్ర ||
No comments:
Post a Comment