తిరు వేంకటాధీశా జగదీశా
శ్రీ శైల వాసా , శేషాద్రి వాసా
గరుడాద్రి వాసా, వేంకటా ద్రీశా
నారాయణా ద్రీశా, వృషభాద్రి వాసా
వృష శైల వాసా సర్వ లోకేశా
తిరు వేంకటాధీశ జగదీశా
కరుణ నేలగ రావ కమలేశా || తి ||
కోటి గొంతులు నిన్ను గోవింద యని పిలువ
కోటి చేతులు నీకు కోరి జేతలు చేయ
కోరికలు దీర్చేటి కొంగు బంగారమై
కొండలే డింటిపై కొలువు దీరేవయ్యా || తి ||
పాతకమ్ములు దీర్చు పంచ ధారల నడుమ
బహు పుణ్య ప్రదమైన స్వామీ హృది తీరాన
ఆనంద నిలయాన అందాన కొలువున్న
ఆనంద రూప మమ్మా దరింపగా రావే || తి ||
శివ రూప మీవంచు చెప్పుదురు కొందరు
ఆది శక్తి వటంచు అందు రింకొందరు
శివ రూప మీవంచు చెప్పుదురు కొందరు
ఆది శక్తి వటంచు అందు రింకొందరు
నారాయణు డంచు నమ్ముదురు కొందరూ
మూడు శక్తులు గూడ ముచ్చటౌ రూపమ్ము || తి ||
తిరు వేంకటాధీశ జగదీశా ......... జగదీశా
No comments:
Post a Comment