Search SakriBuddi Blog

Sunday, August 2, 2020

కరుణ జూపవైయ్యా వరము లీయవైయ్యా

కరుణ   జూపవైయ్యా  వరము  లీయవైయ్యా

మురళీ  మోహన   వినీల  మేఘ శ్యామా           .....  || క|| 

నీ  పైన  మరలిన చాలుగా 

పులులే  జింక లై  లెంకలుగా  మారుగా 

నిరుపమా లీలా నిలయా దయామయా          .....  || క|| 

మదిలో  నీ స్మరణా  సలిపిన  హాయిగా 

బ్రతుకే  తీయనై  వెన్నెలై  కాయగా 

త్రిభువన పావనా, చరణా  సనాతనా               .....  || క|| 

రాధే  గోవింద  కృష్ణ    రాధే గోపాల కృష్ణ 

రాధే  గోవింద  కృష్ణ    రాధే గోపాల కృష్ణ 

కన్నులకు   విందుగా  కనిపించ వయ్య కృష్ణా  

రాధే  గోవింద  కృష్ణ    రాధే గోపాల కృష్ణ  

రాధే  గోవింద  కృష్ణ    రాధే గోపాల కృష్ణ  

కృష్ణా            కృష్ణా              కృష్ణా 

No comments:

Post a Comment