ఏడు కొండల పైన నీ వూ ఎక్కడో దూరాన నే ను
ఏడు కొండల పైన నీ వూ
ఎక్కడో దూరాన నే నూ || ఏ ||
హరి నామ స్మరణే నడిపించే నన్నూ
గిరులన్ని దాటి చేరితిని నిన్నూ || ఏ ||
మల్లెల మొల్లలు మందారాలను
మాలగా చేసి వేసితి నేనూ
మంచి గంధమూ మరువక తెచ్చితీ
మై మరచి నిను పూజించాలని || ఏ ||
ఆలు మేలమ్మా అనుమతి కోరితి
ఆండాళమ్మను అర్థించితిని
ఒక సారి నిన్నూ దర్శించాలని
మొక్కులన్నీ తీర్చి వేడుకో వాలని || ఏ ||
ఏడు కొండల పైన నీ వూ
ఎక్కడో దూరాన నే నూ || ఏ ||
హరి నామ స్మరణే నడిపించే నన్నూ
గిరులన్ని దాటి చేరితిని నిన్నూ || ఏ ||
No comments:
Post a Comment