శ్రీ శ్రీనివాసం నమామి శ్రీ వేంకటేశం
శ్రీ శ్రీనివాసం నమామి, శ్రీ వెంకటేశం స్మరామి
శరణం స్వామీ అంతర్యామీ
షోడ షోపా చార పూజ సమర్పయామి || శ్రీ శ్రీ ||
అలమేల మంగ పతికి ఆవాహనం
ఆపు రూప దేవునికి ఆసనం
సకల లోక పాలకునికి ఆచనం
సప్త గిరీశునకు పట్టు పీతాంబరం || శ్రీ శ్రీ ||
తిరుమల వాసునికి మంత్ర పుష్పాంజలి
సర్వాంతర్యామికి ఇదే సుగంధాoజలి
బ్రహ్మాండ నాయకునికి అక్షతాంజలి
ధర్మ సంస్థాప నునికి దీపాంజలి || శ్రీ శ్రీ ||
పురుషోత్తమునికి నైవేద్యం
పద్మావతీ పతికి నీరాంజనం
శ్రీ పతికి కరిష్యామి ప్రదక్షిణం
శ్రీ వారికి సాష్టాంగ నమస్కారం || శ్రీ శ్రీ ||
No comments:
Post a Comment