కలనైనా కన లేదు వేంకటేశా
కలనైనా కన లేదు వేంకటేశా
నిన్ను కనులార చూడలేదు శ్రీనివాసా || క ||
కలనైనా కన లేదు వేంకటేశా
నిన్ను కనులార చూడలేదు శ్రీనివాసా
గోవు నైనా, కాక పోతి గోకుల నందనా
క్షీర ధారా లియ్యకుంటి శేష శైల వాసా
అగస్త్యు నైనా కాక పోతి ఆనంద రూపా
ఆతిథ్య మియ్య కుంటి వడ్డీ కాసుల వాడా || క ||
గరుడ నైనా కాక పోతి పక్షి వాహనా
నీ వాహనాన్ని అవక పోతి శిష్ట పరిపాలకా
తులసి నైనా కాలేదు భక్త వత్సలా
నీ మెడలోకి చేరలేదు నిత్యా నిర్మలా || క ||
పద కవితలు అల్ల లేను తిరుమలేశా
అన్నమయ్య కాలేదు చిద్వి లాసా
ధన కానుక లెమిత్తును నీల మేఘ శ్యామా
తల నీలాలు అర్పింతును నిఖిల న లోకేశా || క ||
No comments:
Post a Comment