శ్రీ దేవి భూ దేవి తోడా
శ్రీ దేవి భూదేవి తోడా .. . . . . . .
కళ్యాణ మొనరించు వేళా ..... నాస్వామి
కళ్యాణ మొనరించు వేళా ..... || శ్రీ ||
కనుల కాటుక బెట్టి కంగలము చే బట్టి
ఘల్లు ఘల్లునా మ్రోగు, గజ్జె లంచెలు కట్టి
ఆ వంక, ఈ వంక అమ్మ లిద్దరి చేర్చి
ఆ వంక, ఈ వంక అమ్మ లిద్దరి చేర్చి
అందాక నను చూచి ఆదరింతువు స్వామీ
ఆదరింతువు స్వామీ..... || శ్రీ ||
బంధువు నీ వనుచు భావము నీ వనుచూ
నీవే దిక్కని నమ్మి నీ చెంత చేరినా
నన్నాడా రించరా శ్రీ వెంకటేశా
శ్రీ వెంకటేశా || శ్రీ ||
No comments:
Post a Comment