నీ కొండకు నీవే రప్పించుకో
నీ కొండకు నీవే రప్పించుకో
ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో
నీ కొండకు నీవే రప్పించుకో
ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో || ప ||
ఓ తిరుపతి వేంకటేశ ఓ శ్రీనివాసా
నీ విచ్చిన ఈ జన్మకు విలువు కట్టు కోవయ్యా
నీ కొండకు నీవే రప్పించుకో
ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో || నీ ||
కొండంత సంసారం మోయలేని మానవులం
ఏడుకొండల నెక్కి రమ్మంటే రాలేము
సాటి మనిషి సౌఖ్యానికి సాయ పడనీ దుర్భలులం
స్వర్గానికి నిచ్చెనలు వేయ లేము || నీ ||
మా మనస్సు, మా హృదయం, పరస్పరం శత్రువులై
మా లోపలి దివ్య జ్యోతి మసకేసి పోతున్నది
అహంకార మణగించి మమకారం తొలగించి
చేయూత నిచ్చి మమ్ము చేర దీయ వయ్యా || నీ ||
No comments:
Post a Comment