తిరుమల నిలయా, కలియుగ వరదా
తిరుమల నిలయా, కలియుగ వరదా, మనసా స్మరామి
వేంకట రమణా, సంకట హరణా, శిరసా నమామి || తి ||
తలచితి, కొలచితీ, వేదన తెలిపితీ, నా మది అర్పించితీ || తి ||
వేయేల కిరణాల, వెలుగూ నీవనీ
వేదన తొల గించు, స్వామీ నీవనీ
మొక్కు తున్నానయా, దిక్కు నీవే నయా
భక్తికి, ముక్తికి నీవే నాకు శక్తివి || తి ||
నిత్యా కళ్యాణాల స్వామివి నీవనీ
నీదరి చేరినా వ్యథలే తొలిగే ననీ
నిన్ను చూడాలనీ జన్మ తరి యించా లనీ
చేరితి వేడితి, మదిని చేసి హారతీ || తి ||
తిరుమల నిలయా, కలియుగ వరదా, మనసా స్మరామి
వేంకట రమణా, సంకట హరణా, శిరసా నమామి || తి ||
No comments:
Post a Comment