నీ ఉండు కొండ దయనిండు కొండా
నీ ఉండు కొండా దయనిండు కొండా
శరణన్న వారికి నిండైన అండా || నీ ||
ఓ వెంకటేశా ఓ శ్రీనివాసా
వేదాలు పొగడే వైకుంఠ వాసా || నీ ||
ఎ పేరుతో నిన్ను ఎలుగెత్తి పిలిచినా
కరుగునే నీ గుండె కలకండ వోలె
మా కియే నీ పూజ కాధార మంత్రం
భక్తియే నిను చేరు కైవల్య భాగ్యం || నీ ||
మనసుతో నీ గుండె కరిగించ లేనూ
శాస్ట్రాల పై నేను నడచి రాలేను
ఈ కంటి నీటితో పాదాలు కడిగి
మనసుతో పూజింతు శ్రీ శ్రీనివాసా || నీ ||
నీ ఉండు కొండా దయనిండు కొండా
శరణన్న వారికి నిండైన అండా || నీ ||
No comments:
Post a Comment