గగనం ఈ భువనం నీదే ....
ప. గగనం ఈ భువనం నీదే, చలనం మా జీవం నీదే
గగనం ఈ భువనం నీదే, చలనం మా జీవం నీదే
నిరంతరం జగతిని కాచే శ్రీనివాసా , నీ సాటి నీవే ఈశా వేంకటేశ
నిరంతరం జగతిని కాచే శ్రీనివాసా , నీ సాటి నీవే ఈశా వేంకటేశ || గ ||
శ్రీనివాసా వేంకటేశా ,
ఆది పురుషా , నిర్మల చరితా ,
నీలమేఘ శ్యామా..... గోవిందా
హరి గోవిందా హరి గోవిందా || గ్రూ ||
పాహి పరమ దయాకర దేవా , పాహి అగణిత వరద ఈశా
సురముని సేవిత శ్రీ హరి గోవిందా ..... దేవరా..... || గ ||
గగనం ఈ భువనం నీదే, చలనం మా జీవం నీదే
2 నంద నందనా నవనీత చోరా గోవిందా
కష్ట నివారకం శిష్ట పాలకా గోవిందా
హరి గోవిందా హరి గోవిందా || గ్రూ ||
అనాథ రక్షక ఆపత్బాంధవ
పావన చరిత పాహి మురారి గోవిందా
హరి గోవిందా హరి గోవిందా || గ్రూ ||
పాహి కరుణాకర దేవా, పాహి కలియుగ వరదా ఈశా
గగనం ఈ భువనం నీదే, చలనం మా జీవం నీదే
వేంకట నాయక శ్రీ హరీ గోవిందా..... దేవరా ..... || గ ||
3 దినకర తేజా ధరణీ నాయక ,
దినకర తేజా ధరణీ నాయక ,
తిరుమల వాసా శ్రీ నారాయణ గోవిందా
హరి గోవిందా హరి గోవిందా || గ్రూ ||
భక్త తారకా లక్ష్మీ వల్లభ, నంద కుమారా
నవనీత చోరా… గోవిందా...
హరి గోవిందా హరి గోవిందా || గ్రూ ||
పాహి పురాణ దేవా, పాహి పరమ దయాకర ఈశా
దయ గని కరుణతో మేము గను గోవిందా
గగనం ఈ భువనం నీదే, చలనం మా జీవం నీదే || గ ||
శ్రీనివాసా వేంకటేశా ,
ఆది పురుషా , నిర్మల చరితా ,
నీలమేఘ శ్యామా..... గోవిందా
హరి గోవిందా హరి గోవిందా || గ్రూ ||
No comments:
Post a Comment