మాధవా కేశవా మధుసూదనా విష్ణు
మాధవా కేశవా , మధుసూదనా విష్ణు
శ్రీ ధరా పదనఖం చింతయామి యూయం || మా ||
మాధవా కేశవా , మధుసూదనా
వామనా గోవిందా వాసుదేవ ప్రద్యుమ్న
రామ రామ కృష్ణ నారాయణాచ్యుతా
దామోదరా నిరుద్ధా దైవ పండరి కాక్ష
నామాత్రయాధీశ నమో నమో || మా ||
పురుషోత్తమా పండరీకాక్షం
దివ్య హరి సంకర్షణా ధోక్షజా
నారసింహ హృషి కేశ నగధర త్రివిక్రమా
శరణాగత రక్ష జయ జయ సేవే || మా ||
మగత జనార్దనా, మత్స్య కూర్మ వరాహ
సహజా భార్గవ బుద్దా, జయ తురగ కల్కి
విహిత విజ్ఞాన శ్రీ వేంక టేశ శుభకరం
అహ మివ, పద దాస్యం, అనిశం భజామి || మా ||
No comments:
Post a Comment